న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో.. పేపర్ లీకేజీల గురించి ప్రధాని మోదీ .. సభలో ప్రకటన చేయకుండా .. వీడియోల్లో ఎందుకు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖన్గే ప్రశ్నించారు. వీడియోల ద్వారా వన్‌సైడ్ మన్‌కీ బాత్ వినిపించాల్సిన అవసరం లేదన్నారు. నీట్ పేపర్ లీకేజీ అంశంపై గురువారం అర్థరాత్రి ప్రధాని మోదీ తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. నీట్ లీకేజీలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నామని, దీనిపై కేబినేట్లో చర్చిస్తామని మోదీ తన వీడియోలో తెలిపారు.
అయితే పేపర్ లీకులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునే అంశంపై వచ్చే వారం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఖర్గే స్పందిస్తూ.. ఇవాళ పార్లమెంట్‌కు వచ్చే ముందు.. ధర్మేంద్ర ప్రధాన్‌ను ముందుగా డిస్మిస్ చేయాలని, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని, లాఠీఛార్జ్‌కు ఆదేశించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆ తర్వాతే మేం సభలో విద్యా వ్యవస్థ గురించి చర్చిస్తామని ఖర్గే అన్నారు.
जब संसद चल रही होती है तो प्रधानमंत्री को संसद के पटल पर Statement देना होता है, देर रात एक वीडियो बनाकर, संसद के बाहर एकतरफ़ा “मन की बात” नहीं करनी होती !! @narendramodi जी,
आज संसद में आने से पहले, धर्मेंद्र प्रधान को बर्खास्त कर के आइएगा। पहले छात्रों से माफ़ी माँगिए और…
— Mallikarjun Kharge (@kharge) July 24, 2026