సోమవారం 25 జనవరి 2021
National - Dec 20, 2020 , 13:20:26

గురుద్వారాలో ప్ర‌ధాని మోదీ ప్రార్థ‌న‌లు

గురుద్వారాలో ప్ర‌ధాని మోదీ ప్రార్థ‌న‌లు

న్యూఢిల్లీ: ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆదివారం ఉద‌యం ఆకస్మికంగా ఢిల్లీలోని గురుద్వారా ర‌క‌బ్ గంజ్ సాహిబ్‌కు వెళ్లారు. త‌న షెడ్యూల్‌లో లేక‌పోయినా అప్ప‌టిక‌ప్పుడు మోదీ గురుద్వారాకు వెళ్ల‌డం ఆశ్చర్య‌ప‌రిచింది. ఈ సంద‌ర్భంగా గురు తేజ్ బ‌హ‌దూర్‌కు మోదీ నివాళుల‌ర్పించారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను నిరసిస్తూ పంజాబ్‌, హర్యానా రైతులు ఆందోళ‌న చేస్తున్న స‌మ‌యంలో మోదీ పర్య‌ట‌న‌కు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. తేజ్ బ‌హ‌దూర్‌కు నివాళుల‌ర్పిస్తూ.. ఆయ‌న జీవితం ధైర్య‌సాహ‌సాలు, ద‌యాగుణాల క‌ల‌యిక అని మోదీ ప్ర‌శంసించారు. తేజ్ బ‌హ‌దూర్ ష‌హీదీ దివ‌స్ సంద‌ర్భంగా ఆయ‌న‌కు శిర‌స్సు వంచి వంద‌నం చేస్తున్న‌ట్లు మోదీ పేర్కొన్నారు. అయితే మోదీ గురుద్వారా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఎలాంటి పోలీసు బందోబ‌స్తుగానీ, సాధార‌ణ ట్రాఫిక్‌ను నిలిపేయ‌డంగానీ చేయ‌క‌పోవ‌డం విశేషం. గురు తేజ్ బ‌హ‌దూర్ సిక్కుల 9వ గురువు. 


logo