PM Modi | క్యాథలిక్ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం వాటికన్ సిటీలోని తన నివాసంలో (Casa Santa Marta) తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని వాటికన్ సిటీ (Vatican City) అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పోప్ మృతిపట్ల పలువురు ప్రపంచ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సైతం పోప్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోప్ మరణ వార్త తీవ్ర బాధను కలిగించిందన్నారు. భారత ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
‘పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ మరణం తీవ్ర బాధ కలిగించింది. ఈ విషాద సమయంలో ప్రపంచ క్యాథలిక్ సమాజానికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. పోప్.. చిన్నప్పటి నుంచీ ఆయన ప్రభువైన క్రీస్తు ఆదర్శాలను సాకారం చేసుకోవడానికి తనను తాను అంకితం చేసుకున్నారు. పేదలు, అణగారిన వర్గాలకు ఎంతో శ్రద్ధగా సేవ చేశారు. ఆయనతో సమావేశమైన సందర్భాలను నేను ఎప్పటిగా ప్రేమతో గుర్తుంచుకుంటాను. ఆయన నుంచి ఎంతో ప్రేరణ పొందాను. భారత ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది’ అని ప్రధాని తన ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు గతంలో వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిన్‌ను కలిసిన సందర్భంగా దిగిన ఫొటోలను పంచుకున్నారు.
Deeply pained by the passing of His Holiness Pope Francis. In this hour of grief and remembrance, my heartfelt condolences to the global Catholic community. Pope Francis will always be remembered as a beacon of compassion, humility and spiritual courage by millions across the… pic.twitter.com/QKod5yTXrB
— Narendra Modi (@narendramodi) April 21, 2025
అక్టోబర్ 2021లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లిన ప్రధాని.. వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిన్‌ను కలిశారు. దాదాపు 30 నిమిషాలపాటు పోప్ ఫ్రాన్సిస్, ప్రధాని మోదీ వివిధ విషయాలపై మాట్లాడుకున్నారు. అనంతరం భారత్‌కు రావాల్సిందిగా పోప్‌ను ప్రధాని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనకు పలు ప్రత్యేకమైన బహుమతిని కూడా అందజేశారు. పూర్తిగా సిల్వర్‌తో తయారు చేసిన క్యాండిల్ స్టాండ్, ఓ పుస్తకాన్ని పోప్‌కు ప్రధాని బహుమతిగా ఇచ్చారు. ఫ్రాన్సిస్ కూడా మోదీకి ఓ గిఫ్ట్ ఇచ్చారు. బ్రాంజ్‌తో తయారు చేసిన ఓ సర్క్యులర్ మెమోంటోను అందజేశారు. బైబిల్ సూక్తులతో ఉన్న ఆ గిఫ్ట్‌ను మోదీ అందుకున్నారు.
#WATCH | Pope Francis died on Easter Monday, April 21 at the age of 88 at his residence in the Vatican’s Casa Santa Marta.
(Source: ANI archive) pic.twitter.com/lhe9BVeMvj
— ANI (@ANI) April 21, 2025
Also Read..
Pope Francis | క్యాథలిక్ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
Pope Francis: పోప్ మరణం తర్వాత ఏం జరుగుతుంది.. ఫ్రాన్సిస్‌ను ఎక్కడ ఖననం చేస్తారంటే?
Spadex Docking | స్పెడెక్స్ సెకండ్ డాకింగ్ సక్సెస్.. రెండు వారాల్లో మరిన్ని ప్రయోగాలకు సిద్ధం