Spadex Docking | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) మరో ఘనత సాధించింది. PSLV-C60/SpaDeX మిషన్‌లో భాగంగా రెండో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) సోమవారం ఉదయం ఎక్స్ ద్వారా ప్రకటించారు.
ఉపగ్రహాల రెండో డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు చెప్పారు. PSLV-C60/SpaDeX మిషన్‌ను గత ఏడాది డిసెంబర్ 30న ప్రయోగించినట్లు గుర్తుచేశారు. తొలిసారిగా శాటిలైట్లను ఈ ఏడాది జనవరి 16న ఉదయం 6:20 గంటల సమయంలో విజయవంతంగా అనుసంధానించినట్లు తెలిపారు. ఆ తర్వాత మార్చి 13న ఉదయం 9:20 గంటల ప్రాంతంలో వాటిని అన్‌డాకింగ్ కూడా చేసినట్లు వివరించారు. రాబోయే రెండు వారాల్లో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఎక్స్ ద్వారా వెల్లడించారు.
#ISRO SPADEX Update:
Glad to inform that the second docking of satellites has been accomplished successfully.As informed earlier, the PSLV-C60 / SPADEX mission was successfully launched on 30 December 2024. Thereafter the satellites were successfully docked for the first time…
— Dr Jitendra Singh (@DrJitendraSingh) April 21, 2025
గతేడాది డిసెంబర్ 30న స్పేడెక్స్ మిషన్‌ను ఇస్రో చేపట్టిన విషయం విదితమే. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ60 రాకెట్ ద్వారా ఎస్‌డీఎక్స్01 (ఛేజర్), ఎస్‌డీఎక్స్02 (టార్గెట్) అనే రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. ఒక్కొక్కటి 220 కిలోల బరువుండే ఆ శాటిలైట్లతో పాటు 24 పేలోడ్లను కూడా పీఎస్ఎల్వీ తీసుకెళ్లింది.
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ రాకెట్ 15 నిమిషాల తర్వాత వాటిని 475 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆ తర్వాత జనవరి 7, 9, 11 తేదీల్లో డాకింగ్ ప్రక్రియ చేపట్టాలని ఇస్రో అనుకున్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించిన తర్వాత జనవరి 16న రెండు ఉపగ్రహాల అనుసంధానాన్ని ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. ఆ తర్వాత మార్చి 13న వాటిని అన్‌డాకింగ్ చేసింది. ఇప్పుడు రెండోసారి డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది.
Also Read..
Civil Services Day: మా పాలసీలతో 1000 ఏళ్ల భవిష్యత్తు: ప్రధాని మోదీ
Rs.500 Notes | పెద్ద ఎత్తున చెలామణీలోకి ఫేక్ రూ.500 నోట్లు.. ఎలా గుర్తించాలంటే..?
Rahul Gandhi | భారత్‌లో ఎన్నికల సంఘం రాజీ పడింది : రాహుల్ గాంధీ