న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, తాము తీసుకుంటున్న నిర్ణయాలు.. దేశ భవిష్యత్తును మరో వెయ్యేళ్ల పాటు తీర్చిదిద్దనున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన 17వ సివిల్ సర్వీసెస్ డే(Civil Services Day) సందర్భంగా ఆయన ప్రసంగించారు. భారత్లో ఆశావాహ సమాజ ఆశయాలు.. అసాధారణ రీతికి చేరుకుంటున్నాయని, ఆ కలల్ని నిజం చేసేందుకు అమితమైన వేగంతో పని చేయాల్సి ఉంటుందన్నారు. సమగ్ర దేశాభివృద్ధి ముఖ్యమని, ప్రతి గ్రామం.. ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడిని వదలకుండా అభివృద్ధి సాగాలన్నారు. ప్రభుత్వ స్కీములు ప్రజలకు చేరిన తీరును బట్టి.. పరిపాలనా నాణ్యత తెలుస్తుందన్నారు.
#WATCH Delhi: Addressing the 17th Civil Services Day event at the Vigyan Bhawan, PM Modi says, “Some time ago, from the Red Fort, I said that today’s India must strengthen the foundation for the next thousand years. We have passed the first twenty-five years of the thousand-year… https://t.co/hjmaEMV52R pic.twitter.com/L0qTvg5ETE
— ANI (@ANI) April 21, 2025
ప్రజలకు అన్ని స్కీములు చేరితే అప్పుడు ఆ ప్రభావం గ్రౌండ్ స్థాయి నుంచి మారుతుందన్నారు. గత పదేళ్లలో భారత్ అసాధారణ రీతిలో మార్పులను చవిచూసిందన్నారు. పరిపాలన, పారదర్శకత, ఆవిష్కరణ అంశాల్లో భారత్ కొత్త ప్రమాణాలను నెలకొల్పిందన్నారు. ఇది టెక్నాలజీ యుగమని, అయితే వ్యవస్థలను సమర్థవంతంగా మేనేజ్ చేయడమే పరిపాలన అని ప్రధాని తెలిపారు.