Pope Francis | క్యాథలిక్ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 88 ఏండ్లు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్.. ఇవాళ వాటికన్ సిటీలోని తన నివాసంలో (Casa Santa Marta) తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని వాటికన్ సిటీ (Vatican City) అధికారికంగా ప్రకటించింది. పోప్ నిన్న ఈస్టర్ (Easter) వేడుకల్లో పాల్గొన్నట్లు తెలిపింది.
పోప్ ఫ్రాన్సిస్ గత కొన్నేళ్లుగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో తీవ్రమైన శ్వాసకోస సమస్యతో ఆయన రోమ్‌లోని ఆసుపత్రిలో చేరారు. దాదాపు రెండు నెలలు అక్కడే చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ తుది శ్వాస విడిచినట్లు వాటికన్ అధికారులు ప్రకటించారు. పోప్ ఫ్రాన్సిస్ 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించారు. ఆయన అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. పోప్ బెనెడిక్ట్ XVI రాజీనామాతో 2013 మార్చి 13న కేథలిక్ చర్చికి 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి పోప్‌గా నియమితులైన తొలి వ్యక్తిగా నిలిచారు.
Pope Francis died on Easter Monday, April 21, 2025, at the age of 88 at his residence in the Vatican’s Casa Santa Marta: Vatican News pic.twitter.com/Rmn88TQbhw
— ANI (@ANI) April 21, 2025
Also Read..
“Pope Francis | కొత్తగా శ్వాససంబంధిత సమస్యలు లేవు.. నిలకడగానే పోప్ ఆరోగ్యం : వాటికన్”
“Pope Francis: రోమ్ ఆస్పత్రిలో పోప్ ఫ్రాన్సిస్‌కు కొనసాగుతున్న చికిత్స”
“Pope Francis: ఆస్పత్రిలోనే పోప్ ఫ్రాన్సిస్.. శ్వాసకోస సమస్యలకు చికిత్స”