రోమ్: పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం రోమ్‌లోని జిమేలీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. శ్వాసకోస సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం సంక్లిష్టంగా ఉన్నట్లు వాటికన్ వర్గాలు వెల్లడించాయి. పాలీమైక్రోబియల్ రెస్పిరేటరీట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో పోప్ బాధపడుతున్నట్లు వాటికన్ ప్రతినిధి మాటియో బ్రూనీ తెలిపారు. కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో ఉంటే, శ్వాసకోస వ్యాధి లక్షణాలు తగ్గే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. గత వారం ఆయనకు బ్రాంకైటిస్ లక్షణాలు కనిపించాయి. దీంతో చాలా కార్యక్రమాలకు ఆయన హాజరుకాలేకపోయారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో రెగ్యులర్ ప్రార్థనలకు హాజరుకాలేదు. పోప్ ఫ్రాన్సిస్ పూర్తిగా రెస్టు తీసుకోవాలని వాటికన్ వైద్యులు సూచించారు.