Pope Francis | క్యాథలిక్ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వాటికన్ (Vatican) అధికారులు తెలిపారు. కొత్తగా శ్వాససంబంధిత సమస్యలు ఏవీ లేవని వెల్లడించారు. డబుల్ నిమోనియాకు (double pneumonia) గురైన ఫ్రాన్సిస్ ఫిబ్రవరి 14 నుంచి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. మూడు వారాలుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం పోప్ ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వాటికన్ అధికారులు వెల్లడించారు. బుధవారం అంతా ఆయన కుర్చీలోనే గడిపినట్లు పేర్కొన్నారు. అయితే, పూర్తిగా ప్రమాదం నుంచి బయటపడలేదని.. మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. పోప్ పగటిపూట ప్రశాంతంగా గడిపినప్పటికీ రాత్రి వేళ మెకానికల్ వెంటిలేషన్ అవసరం ఏర్పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. తీవ్రమైన శ్వాసకోస సమస్యతో బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్‌ను ఫిబ్రవరి 14వ తేదీన రోమ్‌లోని గిమేలీ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే.
Also Read..
Donald Trump | ఇదే మీకు చివరి హెచ్చరిక.. హమాస్‌కు ట్రంప్ వార్నింగ్
S Jaishankar | జైశంకర్ లండన్ పర్యటనలో భద్రతా వైఫల్యం.. కేంద్ర మంత్రిపై దాడికి ఖలిస్థానీల యత్నం
S Jaishankar | అధిక సుంకాలతో భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలపై అనిశ్చితి.. జై శంకర్ ఏమన్నారంటే..?