PM Modi | మసాలా మరమరాలు రుచిచూపించు భాయ్.. ఓ చిరువ్యాపారితో ప్రధాని మోదీ ముచ్చట్లు.. Video
PM Modi | పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారంలో భాగంగా పలు ర్యాలీల్లో ప్రసంగించిన ప్రధాని మోదీ (PM Modi).. ఓ చిన్న దుకాణం దగ్గరికి వెళ్లి ఝాల్మురీ (మసాలా మరమరాలు-JhalMuri) కొని తిని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఝార్గ్రామ్ (Jhargram) లో రహదారి పక్కన ఓ దుకాణం ముందు ఆదివారం ప్రధాని వాహనాల శ్రేణి ఆగింది.
PM Modi : పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారంలో భాగంగా పలు ర్యాలీల్లో ప్రసంగించిన ప్రధాని మోదీ (PM Modi).. ఓ చిన్న దుకాణం దగ్గరికి వెళ్లి ఝాల్మురీ (మసాలా మరమరాలు-JhalMuri) కొని తిని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఝార్గ్రామ్ (Jhargram) లో రహదారి పక్కన ఓ దుకాణం ముందు ఆదివారం ప్రధాని వాహనాల శ్రేణి ఆగింది. దీంతో స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడారు. అంతలో వాహనం దిగి ప్రధాని స్వయంగా దుకాణంవైపు నడుచుకుంటూ రావడం చూసి దుకాణ యజమాని ఆశ్చర్యపోయారు. ‘భాయ్.. నీ ఝాల్మురీ రుచి చూపించు’ అన్నారు. ‘ధరెంత..? బాగా చెయ్’ అని చెప్పారు. ప్రధానితో తనతో మాట్లాడటంతో ఆ చిరు వ్యాపారి ఆనందానికి అవధుల్లేవు.
మోదీ డబ్బులిస్తున్నా తీసుకోవడానికి ఆ దుకాణదారుడు నిరాకరించారు. ప్రధాని బలవంతం చేయడంతో చివరికి డబ్బులు తీసుకున్నారు. మరమరాల్లో అన్ని పదార్ధాలు వేయమంటారా..? అని అడిగారు. దానికి మోదీ.. ఉప్పు తప్ప అన్నీ వేయ్ అని బదులిచ్చారు. ‘మీరు ఉల్లిపాయలు తింటారా..’ అని దుకాణదారుడు అడిగగా.. ‘ఉల్లిపాయలు తింటాను.. బుర్ర మాత్రం తినను’ అని బదులిచ్చారు. దాంతో అక్కడ నవ్వులు పూశాయి.
Jhalmuri break in Jhargram! pic.twitter.com/LJNjEojAW4
— Narendra Modi (@narendramodi) April 19, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

