ఢిల్లీ : జాతినుద్దేశిస్తూ చేసే ప్రసంగాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరచుగా దేశ పౌరుల నుండి సలహాలు, సూచనలు ఆహ్వానించే విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగానే తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగానికి ప్రధాని సూచనలు ఆహ్వానించారు. మీ ఆలోచనలు, సూచనలు ఆగస్టు 15న ప్రధాని ప్రసంగంలో చోటుచేసుకొని ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రతిధ్వనిస్తాయి. అయితే ప్రధాని ప్రసంగం కోసం మీ ఇన్పుట్స్ ఏంటీ? వాటిని @mygovindia కు ట్వీట్ చేయాల్సిందిగా ప్రధాని కార్యాలయం శుక్రవారం పేర్కొంది. ప్రధాని కార్యాలయం ఈ ట్వీట్ చేసిన సెకన్ల వ్యవధిలోనే ప్రజలు తమ ఆలోచనలను పోస్టు చేయడం ప్రారంభించారు.
ట్విట్టర్ యూజర్ సుమీత్ మోహతా ట్వీట్ చేస్తూ పాఠశాల్లోని బోధన, బోధనేతర సిబ్బందికి టీకాలు వేయడానికి ఒక మిషన్ ప్రోగ్రాంను ప్రకటించాలన్నారు. ఇది భవిష్యత్తుకు మీ అతిపెద్ద బహుమతి అవుతుందని పేర్కొన్నారు. మరో ట్విట్టర్ యూజర్ ఆకాష్ సింగ్ స్పందిస్తూ.. జనాభ పెరుగుదల భారత్ అతిపెద్ద సమస్యగా మారుతోంది. రాబోయే కొద్ది సంవత్సరాల్లో దేశ జనాభా 150 కోట్లకు చేరుతుంది. కావునా ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోట నుండి జనాభా విస్ఫోటనం గురించి ఏదైనా చెప్పాల్సిందిగా అభ్యర్థించారు.
మరొక ట్విట్టర్ వినియోగదారుడు అనుపమ్ రవి స్పందిస్తూ.. మీరు, మీ క్యాబినెట్ రెగ్యులర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తారని హామీ ఇవ్వగలరా? ద్రవ్యోల్బణం, వస్తువుల ధరలను ఎలా నిర్వహించాలో ప్రభుత్వం యోచిస్తోంది? రిమోట్ విద్యను నిర్వహించడానికి పోస్ట్ కోవిడ్ ప్రపంచంలో ఏటువంటి మౌలిక సదుపాయాలు తీసుకోబడ్డాయి వంటి అంశాలపై ప్రసంగించాల్సిందిగా కోరాడు.
ఈ క్రమంలో చాలా మంది నెటిజన్లు పెగాసస్ సమస్య, రాఫెల్ విచారణ, ఇంధన ధరల పెరుగుదల, వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై మాట్లాడాల్సిందిగా అడిగారు. మరో ట్విట్టర్ యూజర్ దీపక్ కుమార్ స్పందిస్తూ.. ద్రవ్యోల్బనం, నిరుద్యోగిత, కొవిడ్ వల్ల భారత్‌లో నాలుగు లక్షల మంది చనిపోవడం, స్లో వ్యాక్సినేషన్, అవినీతి, కొవిడ్ అనంతరం కూలీల జీవితాలపై దయచేసి మాట్లాడాల్సిందిగా కోరారు.
Your thoughts will reverberate from the ramparts of the Red Fort.
— PMO India (@PMOIndia) July 30, 2021
What are your inputs for PM @narendramodi’s speech on 15th August? Share them on @mygovindia. https://t.co/UCjTFU30XV