PM Kisan : రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం-కిసాన్ (PM Kisan) నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం కింద 21వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లకు పైగా నిధులు జమకానున్నాయి.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది. ఇప్పటివరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. భూమి వివరాలు PM-KISAN పోర్టల్‌లో నమోదై ఉండి, బ్యాంకు ఖాతా ఆధార్‌తో లింక్ అయి ఉన్న రైతులకు పథకం ప్రయోజనాలు అందుతున్నాయి.