న్యూఢిల్లీ, ఫిబ్రవరి : గత ఏడాది నిర్వహించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్ని సవాల్ చేస్తూ ‘జన్ సురాజ్ పార్టీ’ నాయకుడు ప్రశాంత్ కిశోర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీహార్ అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనున్నది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత బీహార్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన పథకం కింద ప్రతి మహిళకు రూ.10 వేలు పంపిణీ చేయడాన్ని, ఎన్నికల కోడ్‌కు విరుద్ధమంటూ పిటిషన్లో ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.