Pitbull Attacks Baby Girl | తాత ఒడిలోని మనుమరాలిపై పిట్‌బుల్ దాడి.. వీడియో వైరల్
Pitbull Attacks Baby Girl | తాత ఒడిలో ఉన్న మనుమరాలిపై పిట్‌బుల్ డాగ్ దాడి చేసింది. వృద్ధుడి ఒడి నుంచి లాక్కున్న చిన్నారిని నోటితో గట్టిగా పట్టుకుని కరిచింది. (Pitbull Attacks Baby Girl ) ఆ పాపను రక్షించేందుకు కుక్క యజమానితో పాటు స్థానికులు చాలా శ్రమించారు.
న్యూఢిల్లీ: తాత ఒడిలో ఉన్న మనుమరాలిపై పిట్‌బుల్ డాగ్ దాడి చేసింది. వృద్ధుడి ఒడి నుంచి లాక్కున్న చిన్నారిని నోటితో గట్టిగా పట్టుకుని కరిచింది. (Pitbull Attacks Baby Girl ) ఆ పాపను రక్షించేందుకు కుక్క యజమానితో పాటు స్థానికులు చాలా శ్రమించారు. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారికి 18 కుట్లు పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. జనవరి 2న బురారీ ప్రాంతంలో ఒక వృద్ధుడి ఒడిలో ఏడాదిన్నర వయస్సున్న మనుమరాలు ఉంది. ఒక వ్యక్తి పెంపుడు కుక్క అయిన పిట్‌బుల్‌ను ఆ వీధిలో తీసుకెళ్తున్నాడు. ఆ కుక్క ఉన్నట్టుండి తాత ఒడిలో ఉన్న చిన్నారిని నోటకరుచుకుంది. గమనించిన స్థానికులు ఆ కుక్క బారి నుంచి చిన్నారిని కాపాడేందుకు తెగ ప్రయత్నించారు. సుమారు నిమిషం పాటు పాపపై ఆ కుక్క దాడి చేసింది.
కాగా, తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అడ్మిట్ చేసి 17 రోజుల పాటు చికిత్స అందించారు. ఆ పాపకు 18 కుట్లు పడగా కాలికి మూడు చోట్ల ఫ్యాక్చర్ కావడంతో కట్టుకట్టారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పిట్‌బుల్ డాగ్స్‌పై దేశంలో నిషేధం ఉన్నప్పటికీ కొందరు పెంచుకోవడంపై నెటిజన్లు మండిపడ్డారు. ఆ కుక్క యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
#DogMenace #PitBull #Delhi: A baby girl one and half yr old was attacked by a #Pitbull dog snatching her from her grandfather's lap in Delhi's #Burari area.
The girl received 18 stitches and suffered 3 fractures on her leg and was hospitalized for 17 days.
The incident was… pic.twitter.com/0HTn95LM84
— Saba Khan (@ItsKhan_Saba) January 19, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

