Pinarayi Vijayan | తిరువనంతపురం: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దాని విజయోత్సవం జరుపుకునే స్థాయికి కాంగ్రెస్ , రాహుల్ గాంధీ దిగజారిపోయారని కేరళ సీఎం విజయన్ విమర్శించారు. బుధవారం జరిగిన ఎప్ఎఫ్ఐ 35వ జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గెలుపునకు ఏమాత్రం అవకాశం లేని కాంగ్రెస్ పార్టీ బీజేపీ అధికారంలోకి రావడానికి మాత్రం సహాయం చేసిందని అన్నారు.
ఢిల్లీలోని మొత్తం 70 సీట్లలో పోటీచేసిన కాంగ్రెస్ 65 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందని, అయినప్పటికీ ఆప్ అధికారం కోల్పోగానే ఆ పార్టీ ఢిల్లీలో విజయోత్సవాలు జరుపుకుందని విమర్శించారు.