Petrol bomb | ఎన్సీపీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనను మరవకముందే తాజాగా మరో నేతపై దుండగులు దాడికి యత్నించారు.
పంజాబ్ (Punjab)లోని శివసేన నేత (Shiv Sena leader) యోగేష్ భక్తి ఇంటిపై కొందరు వ్యక్తులు బుధవారం రాత్రి దాడి చేశారు. లుథియానాలోని ఆయన నివాసంపై పెట్రోల్ బాంబు (Petrol bomb) విసిరారు. అయితే, అదృష్టవశాత్తూ ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ఓ కారు మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Also Read..
Snake | కాటేసిన పాముతో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి.. వీడియో వైరల్
Spurious Liquor | బీహార్లో కల్తీమద్యం తాగి 24 మంది మృతి
TTD | భక్తులకు అలర్ట్.. శ్రీవారి మెట్టు నడక మార్గం బంద్