IndiGo | దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) సర్వీసుల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతోంది. వరుసగా ఐదోరోజు కూడా వందలాది విమానాలు రద్దయ్యాయి. శనివారం ఉదయం ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా సహా అన్ని ఎయిర్‌పోర్టుల్లో 470కిపైగా విమానాలు క్యాన్సెల్ అయ్యాయి. విమానాల రద్దుతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. ఇక ఇండిగో సంక్షోభం తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)కు చేరింది.
విమానాల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ (Petition) దాఖలైంది. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పందించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకొని దీనిపై తక్షణమే విచారణ జరిపేందుకు ప్రత్యేక బెంజ్‌ను ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, డీజీసీఏను ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను సుప్రీం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read..
Indian Railways | ఇండిగో సంక్షోభం వేళ రైల్వే శాఖ కీలక నిర్ణయం
IndiGo | వరుసగా ఐదో రోజూ అదేసీన్.. నేడు 500 విమానాలు రద్దు.. ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల రద్దీ
IndiGo | ఢిల్లీ-బెంగళూరు రూ.లక్ష.. ఆకాశాన్నంటిన విమాన టికెట్ ధరలు