Sanjauli mosque | హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో సంజౌలి మసీదు వివాదం కొనసాగుతోంది. ఈ మసీదును (Sanjauli Mosque) అక్రమంగా నిర్మించారంటూ హిందూ సంఘాలు, స్థానికులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మసీదు కూల్చాలంటూ ఆందోళన చేపట్టిన నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా నేడు హిమాచల్ వ్యాప్తంగా హిందూ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి.
#WATCH | Kullu, Himachal Pradesh: People protest over Shimla’s Sanjauli mosque row pic.twitter.com/pz0bDN0yZx
— ANI (@ANI) September 14, 2024
ఈ మేరకు హిందూ సంఘాల ఆధ్వర్యంలో స్థానికులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో సిమ్లా, కులు సహా ప్రధాన నగరాల్లో దుకాణాలను మూసివేశారు. మరోవైపు బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అన్ని ప్రాంతాల్లోనూ పోలీసులు భారీగా మోహరించారు.
#WATCH | Shimla, Himachal Pradesh: Markets closed in Sunni town as Sunni Vyapar Mandal calls for a ‘Bandh’ over the Sanjauli mosque row pic.twitter.com/rJP2vP7l3L
— ANI (@ANI) September 14, 2024
కాగా, దేవభూమి సంఘటన్ ఆధ్వర్యంలో హిందూ సంఘాలు, స్థానికులు బుధవారం మసీదు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పదేళ్ల కిందట చట్టవ్యతిరేకంగా నిర్మించిన నాలుగంతస్తుల మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు- ఆందోళనకారుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. వాటర్కేన్లను ప్రయోగించారు. దీనికి నిరసనగా ఆందోళనకారులు పోలీసులకు రాళ్లు రువ్వారు.
#WATCH | Kullu, Himachal Pradesh: Markets closed as Kullu Vyapar Mandal calls for a ‘Bandh’ over Shimla’s Sanjauli mosque row pic.twitter.com/6NCwqlpj3Q
— ANI (@ANI) September 14, 2024
అక్రమంగా మసీదు నిర్మించారంటూ (Shimla mosque row) నిరసనలు వెల్లువెత్తడంపై ముస్లిం కమిటీ స్పందించింది. మసీదు అక్రమ నిర్మాణ భాగాన్ని తామే కూల్చివేస్తామని పేర్కొంది. సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించింది. అనధికారిక భాగాన్ని సీల్ చేయాలని కోరారు. అలాగే కోర్టు తీర్పునకు అనుగుణంగా అక్రమ నిర్మాణాన్ని తామే కూల్చివేస్తామని తెలిపారు. ఈ మేరకు మెమోరాండం సమర్పించారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ముస్లింలు హిమాచల్ ప్రదేశ్‌లో శాశ్వత నివాసితులని ముస్లిం కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో మత సామరస్యం, సోదరభావాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముస్లిం సంక్షేమ కమిటీ సభ్యుడు ముఫ్తీ మహ్మద్ షఫీ కాస్మీ మీడియాతో అన్నారు. తమపై ఎవరి ఒత్తిడి లేదని ఆయన చెప్పారు.
కాగా, మసీదులో అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చిన దేవ్ భూమి సంఘర్ కమిటీ ఈ చర్యను స్వాగతించింది. ‘ముస్లిం సమాజం చర్యను మేం స్వాగతిస్తున్నాం. పెద్ద ఆసక్తితో ఈ చొరవ తీసుకున్నందుకు వారిని కౌగిలించుకునే మొదటి వ్యక్తి నేనే అవుతా’ అని కమిటీ సభ్యుడు విజయ్ శర్మ అన్నారు.
Also Read..
PM Modi | నేడు జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారానికి మోదీ.. 42 ఏళ్ల తర్వాత దోడాకు భారత ప్రధాని
Food Science | తరచూ తీపి తినాలనిపిస్తుందేం?.. నియంత్రించుకోవడం ఎలా?
Artificial Intelligence | ఏఐని నమ్ముకుంటే.. మన తెలివి తెల్లారిపోయినట్టే!