ముంబై: ఇండియన్ స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన పేటీఎంకు భారీ షాక్ తగిలింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోకి అరంగేట్రం చేసిన రోజే.. పేటీఎం షేర్లు 26 శాతం పడిపోయాయి. ఎన్ఎస్ఈ వద్ద రూ.1950 వద్ద పేటీఎం ట్రేడింగ్ ప్రారంభించింది. ట్రేడింగ్‌లో 9.3 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. ఇటీవల ఐపీఓ ద్వారా పేటీఎం సంస్థ సుమారు 2.5 బిలియన్ల డాలర్లు ఆర్జించిన విషయం తెలిసిందే. అయితే పేటీఎం వ్యాపార నమోనా లాభసాటిగా లేదని కొందరు ఇన్వెస్టర్లు ఆందోళనలు వ్యక్తం చేశారు. చైనీస్ పేమెంట్ సంస్థ ఆంట్, జపనీస్ టెక్నాలజీ గ్రూపు సాఫ్ట్‌బ్యాంక్ సంస్థలు.. పేటీఎంకు బ్యాకప్ ఇస్తున్నాయి.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ సందర్భంగా పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర శర్మ కన్నీటిపర్యంతమయ్యాడు. బీఎస్ఈ హాల్లో ప్రసంగం చేసిన తర్వాత కన్నీళ్లను తుడుచుకుంటూ కనిపించారు. ఇంజినీరింగ్ చదివిన విజయ్ 2010లో పీటీఎం సంస్థను ఏర్పాటు చేశారు. మొబైల్ రీఛారింగ్ కాన్సెప్ట్‌తో వచ్చిన పేటీఎం అతి తక్కువ సమయంలో పాపులరయ్యింది. స్కూల్ టీచర్ అయిన విజయ్ శర్మ అతి తక్కువ సమయంలోనే బిలీయనీర్‌గా మారాడు. పేటీఎం నికర విలువ ఇప్పుడు 2.4 బిలియన్ల డాలర్లుగా ఉంది.