బుధవారం 03 జూన్ 2020
National - May 15, 2020 , 19:29:42

క్యాష్‌ని కూడా హోమ్ డెలివ‌రీ చేస్తున్న పేటిఎం!

 క్యాష్‌ని కూడా హోమ్ డెలివ‌రీ చేస్తున్న పేటిఎం!

లిక్విడ్ క్యాష్ ఎవ‌రికి ఇవ్వాల‌న్నా చేంజ్ లేదంటూ పేటిఎంకి అల‌వాటు ప‌డ్డారు జ‌నాలు. ఇలా చేస్తే క్యాష్ బ్యాక్ కూడా వ‌స్తుంది. ఈ ఆఫ‌ర్‌ను వ‌దులుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌డ‌ని వారికి పేటిఎం ఇప్పుడు మ‌రో ఆఫ‌ర్ క‌ల్పించ‌నున్న‌ది. ఏటిఎంకు వెళ్ల‌కుండానే క్యాష్ ఇట్లే వ‌చ్చేస్తుంది. డ‌బ్బు కావాల‌నుకునే వారు యాప్‌లో రిక్వెస్ట్ పెడితే వారి ఇంటి వ‌ద్ద‌కు తీసుకొచ్చి న‌గ‌దును అంద‌జేస్తారు. రూ. 1000 నుంచి అత్య‌ధికంగా రూ. 5000 వ‌ర‌కు అందిస్తారు. ప్ర‌స్తుతం ఢిల్లీ నేష‌న‌ల్ క్యాపిట‌ల్ రీజియ‌న్ ప‌రిధిలో ఉండే వారికి మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంద‌ట‌. త్వ‌ర‌లోనే ఇత‌ర న‌గ‌రాల్లో కూడా దీనిని ప్ర‌వేశ‌పెట్ట‌నున్నార‌ని స‌మాచారం. కొన్నిరోజుల క్రిత‌మే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫ‌ర్ సేవ‌ల‌ను పేటిఎం ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే.


logo