సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఇండిగో నిర్వాకంతో హైదరాబాద్ విమానాశ్రయంలో శనివారం ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. 144 సర్వీసులు సేవలను ఇండిగో శనివారం నిలిపేసింది. ఈ క్రమంలో ఆర్టీసీ శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బెంగుళూరు, చెన్నై, వైజాగ్, రాజమహేంద్రవరం, కాకినాడ వంటి నగరాలకు వెళ్లేందుకు స్లీపర్ బస్సులను నడుపుతోంది.
శంషాబాద్ విమానాశ్రయం అరైవల్ ర్యాంప్ పిల్లర్ నంబర్ 8 వద్ద ఈ బస్సులను అందుబాటులో ఉంచింది. చెన్నై బస్ టికెట్ ధర రూ. 2110, బెంగుళూరు సర్వీస్ ధర రూ.1670 గా నిర్ణయించారు.