న్యూఢిల్లీ: చలి కాలం తీవ్రత రానున్న రోజుల్లో పెరుగుతుందని వాతావరణ శాఖ సోమవారం ప్రకటించింది. కర్ణాటకలో సముద్ర తీరానికి దూరంగా ఉన్న జిల్లాలు, మధ్య భారతంలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయని, చలి గాలులతో కూడిన రోజులు రెట్టింపు అవుతాయని తెలిపింది.
కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తగ్గుతాయని చెప్పింది.