Parliament | కొత్త పార్లమెంట్ (Parliament) కొలువుదీరింది. కొత్త పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Session)నేటి నుంచి కొత్త భవనంలో జరగనున్న విషయం తెలిసిందే. గణేష్ చతుర్థిని పురస్కరించుకొని ప్రత్యేక పూజ అనంతరం మధ్యాహ్నం 1.15 గంటలకు లోక్ సభ ప్రారంభమైంది. కొత్త భవనాన్ని ‘పార్లమెంట్ ఆఫ్ ఇండియా’ (Parliament Of India)గా ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త భవనంలో ప్రధాని మోదీ తొలిసారి ప్రసంగించారు. వినాయక చతుర్థిరోజు కొత్త పార్లమెంట్లోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కొత్త సభలోకి ఎంపీలందరినీ ఆహ్వానించారు.
అమృతకాలంలో కొత్త లక్ష్యాలతో ముందుకెళ్తున్నట్లు ప్రధాని తెలిపారు. ‘భవనం మారింది. భావనలు కూడా మారాలి. గత చేదు అనుభవాలను మరిచిపోయి.. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చేలా పనిచేయాలి’ అని ప్రధాని పేర్కొన్నారు. కాగా, మరికాసేపట్లో లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును న్యాయమంత్రి అర్జున్ మేఘ్వాల్ సభ్యుల ముందు ఉంచనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు రాజ్యసభ ప్రారంభం కానుంది.
Also Read..
Elon Musk | యూజర్లకు మస్క్ గట్టి షాక్.. ఇకపై ట్విట్టర్ వాడాలంటే డబ్బు చెల్లించాల్సిందే..!
Congress leader | కాంగ్రెస్ నేత దారుణ హత్య.. బాధ్యత వహించిన ఖలిస్థానీ ఉగ్రవాది
Rajasthan | కోటాలో ఆగని విద్యార్థుల ఆత్మహత్యలు.. విషం తాగి మరో విద్యార్థి మృతి