Rajasthan | ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్య (Prevent Suicides)లు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో విద్యార్థి తనువు చాలించింది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)కి చెందిన ప్రియమ్ సింగ్ (Priyam Singh) అనే 17 ఏళ్ల విద్యార్థిని విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ మహువా ప్రాంతానికి చెందిన ప్రియమ్ సింగ్ ఇంటర్ పూర్తి చేసింది. వైద్య విద్య (NEET-UG) అభ్యసించేందుకు కోటాలో శిక్షణ తీసుకుంటోంది. విజ్ఞాన్ ప్రాంతంలో హాస్టల్లో ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం కోచింగ్ సెంటర్ వద్ద వాంతులు చేసుకుంది. దీంతో తోటి విద్యార్థులు ప్రియమ్ సింగ్‌ను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. విషం తాగి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
కోచింగ్ హబ్ అయిన రాజస్థాన్‌లోని కోటాలో ఒత్తిడి వల్ల విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. గత రెండు వారాల్లోనే ఇది రెండో ఆత్మహత్య ఘటన. మొత్తంగా తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకూ 26 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. రాజస్థాన్ పోలీస్ డేటా ప్రకారం.. 2022లో 15 మంది, 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో ఏడుగురు, 2016లో 17 మంది, 2015లో 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే, కరోనా కారణంగా కోచింగ్ సెంటర్లు మూతపడడంతో 2020, 2021 ఏడాదిల్లో కోటాలో ఒక్క విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకోలేదు.
మరోవైపు విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలతో అప్రమత్తమైన రాజస్థానం ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఎక్కువగా ఫ్యాన్లకు ఉరివేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. ఇందులో భాగంగానే ఇటీవలే కోటాలోని అన్ని హాస్టళ్లు (Hostels), పెయింగ్ గెస్ట్ (PG) వసతుల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్ల (Spring Loaded Fans)ను అధికారులు ఏర్పాటు చేశారు. లోడ్‌ను గుర్తించిన వెంటనే అన్ కాయిల్ అయ్యేలా ఈ ఫ్యాన్లను తయారు చేశారు. లోడ్ అవ్వగానే సీలింగ్ నుంచి ఫ్యాన్ కిందకు జారిపోతుంది. ఈ చర్యలతో కాస్తమేర ఆత్మహత్య ఘటనలను తగ్గించొచ్చని అధికారులు భావిస్తున్నారు.
Also Read..
Congress leader | కాంగ్రెస్ నేత దారుణ హత్య.. బాధ్యత వహించిన ఖలిస్థానీ ఉగ్రవాది
Photo Session | పార్లమెంట్ భవనం వద్ద ఎంపీల ఫొటో సెషన్
UNESCO | హోయసల ఆలయాలకు యునెస్కో గుర్తింపు