Photo Session | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Session)నేటి నుంచి కొత్త భవనంలో జరగనున్న విషయం తెలిసిందే. గణేష్ చతుర్థిని పురస్కరించుకొని ప్రత్యేక పూజ అనంతరం మధ్యాహ్నం 1.15 గంటలకు లోక్ సభ, 2.15 గంటలకు రాజ్యసభ ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఉదయం 9:30 గంటలకు పాత పార్లమెంట్ భవనం వద్ద ఫొటో సెషన్ (Photo Session) నిర్వహించారు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఉభయ సభలకు చెందిన ఎంపీలు ఈ ఫొటో సెషన్లో పాల్గొన్నారు.
సోమవారం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ వెంటనే సభ నేటికి వాయిదా పడింది. దీంతో 96 ఏండ్ల నాటి పాత పార్లమెంటు భవానికి ఎంపీలు వీడ్కోలు పలికారు. నేటి నుంచి కొత్త భవనంలో సభా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కొత్త పార్లమెంట్ భవనంలో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. మరోవైపు కొత్త పార్లమెంట్ భవనాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇవాళ గెజిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi, Rajya Sabha Chairman and Vice President Jagdeep Dhankhar, Lok Sabha Speaker Om Birla and other Parliamentarians gather for the joint photo session ahead of today’s Parliament Session. pic.twitter.com/burhE7OGX1
— ANI (@ANI) September 19, 2023
Also Read..
Nalgodna | మార్నింగ్ వాక్కు వెళ్లిన దంపతులను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం..
Parliament | ఇకపై కొత్తగా నిర్మించిన భవనమే పార్లమెంట్.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం
Vijay Antony | బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని కుమార్తె ఆత్మహత్య