Elon Musk | ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) ఏం చేసినా సంచలనమే. గతేడాది ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్విట్టర్’ (Twitter ) (ఎక్స్)ను టేకోవర్ చేసిన మస్క్.. ఇక అప్పటి నుంచి సంస్థలో సమూల మార్పులు చేస్తూ వస్తున్నారు. చివరికి ట్విట్టర్ పేరును ఎక్స్‌గా మార్చేశారు. పిట్ట స్థానంలో ఎక్స్ లోగోను తీసుకొచ్చారు. ఇటీవలే సంస్థ ఆదాయం పెంచుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ ట్వీట్ డెక్ (TweetDeck) సర్వీసులు ఉచితం.. కానీ వాటిని పెయిడ్ సర్వీసులుగా మారుస్తున్నట్లు వెల్లడించారు.
తాజాగా ట్విట్టర్ యూజర్లందరికీ గట్టి షాక్ ఇస్తూ సంచలన నిర్ణయానికి తెరతీశారు. మస్క్.. ఇప్పటికే బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ సేవను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అధికారిక, ధృవీకరణ ట్విట్టర్ అకౌంట్లకు చిహ్నంగా ఉన్న బ్లూటిక్కు చందా విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు, త్వరలోనే ట్విట్టర్ ఖాతాదారులందరి నుంచి నెలవారీ సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు (Twitter Will Turn Into Paid Service) చేసే యోచనలో ఉన్నట్లు మస్క్ వెల్లడించారు. ప్రతి యూజర్ నుంచి ఎంతో కొంత ఫీజు వసూలు చేయాలనే ప్రదిపాదనలో ఉన్నట్లు తెలిపారు. అయితే, ఎంత ఫీజు వసూలు చేస్తారన్న దానిపై మాత్రం ఆయన స్పష్టతనివ్వలేదు.
ఇజ్రాయెల్‌ప్రధాని (Israeli Prime Minister) బెంజమిన్ నేతన్యాహూ (Benjamin Netanyahu) తో మస్క్ తాజాగా చర్చలు జరిపారు. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఇద్దరూ పలు కీలక విషయాలపై మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఎలాన్ మస్క్‌తో ఇజ్రాయిల్ ప్రధాని మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియా వేదికల్లో ద్వేషపూరిత ప్రసంగాలు పెరిగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం (bots) బాట్స్. వీటిని నిరోధించాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. దీనిపై స్పందించిన ట్విట్టర్ బాస్.. ‘మేము కూడా ఆ దిశగా కృషి చేస్తున్నాము. అందులో భాగంగా త్వరలో ఎక్స్ ఖాతాదారులకు నెలవారీ సబ్స్క్రిప్షన్ ఫీజు విధించాలన్న యోచనలో ఉన్నాము. ఈ విధానం వల్ల బాట్లు ఉపయోగించి ఖాతాలు సృష్టించడం చాలా కష్టతరమవుతుంది’ అని మస్క్ పేర్కొన్నారు.
సబ్స్క్రిప్షన్ ఫీజు విధిస్తామంటూ హింట్ ఇచ్చిన మస్క్.. అది ఎంత మొత్తంలో ఉంటుందనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అలాగే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నవారికి అదనపు ఫీచర్లు కల్పిస్తారా? లేదా? అనే విషయాన్ని కూడా వెల్లడించలేదు. ప్రస్తుతం ఎక్స్ (ట్విట్టర్) ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫీజు కింద నెలకు 8 డాలర్లు చొప్పున వసూలు చేస్తోంది. ఇక ఖాతాదారులందరి నుంచి సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు చేస్తే ట్విట్టర్ కాస్తా పెయిడ్ ప్లాట్ ఫామ్‌గా మారుతుంది. మరోవైపు, ప్రస్తుతం ఎక్స్ (ట్విట్టర్) వేదికలో 550 మిలియన్లకు పైగా నెలవారీ యూజర్లుఉన్నట్లు మస్క్ తెలిపారు. వీరు ఒక రోజులో కనీసం 100 నుంచి 200 మిలియన్ల పోస్టులు పెడుతున్నారని వివరించారు. దీన్ని బట్టి చూస్తే ఒక వేళ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అమలులోకి వస్తే మాత్రం.. ట్విట్టర్ (ఎక్స్) కంపెనీకి భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతుంది.
Also Read..
Naga Chaitanya | త్వరలో తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చేయనున్న నాగచైతన్య – శోభిత..!
Rajasthan | కోటాలో ఆగని విద్యార్థుల ఆత్మహత్యలు.. విషం తాగి మరో విద్యార్థి మృతి
Jawan Movie | షారుఖ్ సర్‌తో మాట్లాడి.. జవాన్ చిత్రాన్ని ఆస్కార్‌కి తీసుకెళ్తా : దర్శకుడు అట్లీ