Jawan Movie | షారుఖ్ సర్‌తో మాట్లాడి.. జవాన్ చిత్రాన్ని ఆస్కార్‌కి తీసుకెళ్తా : దర్శకుడు అట్లీ
Jawan Movie | జవాన్ చిత్రాన్ని ‘ఆస్కార్’ (Oscar)కు పంపాలనుకుంటున్నట్లు దర్శకుడు అట్లీ వెల్లడించారు.
Jawan Movie | బాక్సాఫీసు వద్ద జవాన్ (Jawan Movie) హవా కొనసాగుతోంది. అట్లీ (Atlee) దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) నటించిన ఈ చిత్రం ఈనెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. విడుదలై పదిరోజులకుపైనే అయినప్పటికీ థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తూ.. భారీ వసూళ్లను రాబడుతోంది. రూ.1,000 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో ఉంది. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా సక్సెన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని ‘ఆస్కార్’ (Oscar)కు పంపాలనుకుంటున్నట్లు దర్శకుడు అట్లీ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అట్లీ మాట్లాడుతూ.. ‘అంతా సవ్యంగా జరిగితే జవాన్ చిత్రం ఆస్కార్‌కి వెళ్తుంది. ఓ సినిమా వెనుక ఎంతో మంది శ్రమ ఉంటుంది. ప్రతి డైరెక్టర్, టెక్నీషియన్స్, హీరో, హీరోయిన్ ఇలా.. సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరూ తాము నటించిన చిత్రానికి అవార్డులు రావాలనే కోరుకుంటారు. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, నేషనల్ అవార్డ్స్.. ఇలా ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు తమ సినిమాలకు రావాలనుకుంటారు. నేను కూడా అంతే. నాకు జవాన్ సినిమాని ఆస్కార్‌కి తీసుకెళ్లాలనే కోరిక ఉంది. షారుఖ్ సర్‌తో మాట్లాడి జవాన్ చిత్రాన్ని ఆస్కార్‌కి పంపించే ప్రయత్నాలు చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అట్లీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక జవాన్ చిత్రంలో షారుక్ ద్విపాత్రాభినయం చేశారు. షారుఖ్‌కి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది. బాలీవుడ్ స్టార్ నటి దీపిక పదుకొణె గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ (Red Chillies Entertainments) సమర్పణలో గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించాడు. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దూసుకెళ్తోంది. కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తోంది. షారుఖ్ గత రికార్డులను కూడా ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్ చేసేసింది.
Also Read..
Rajamouli | రాజమౌళి సమర్పణలో ఇండియా బయోపిక్.. వీడియో రిలీజ్ చేసిన జక్కన్న
Congress leader | కాంగ్రెస్ నేత దారుణ హత్య.. బాధ్యత వహించిన ఖలిస్థానీ ఉగ్రవాది
Vijay Antony | బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని కుమార్తె ఆత్మహత్య
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

