Naga Chaitanya | త్వరలో తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చేయనున్న నాగచైతన్య – శోభిత..!
Naga Chaitanya | నాగచైతన్య (Naga Chaitanya), శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌పై ప్రముఖ వార్తా సంస్థ ‘ఇండియా టుడే’ (India Today) ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. నాగ చైతన్య - శోభిత ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలిపింది.
Naga Chaitanya | సమంత (Samantha)తో విడిపోయిన తర్వాత నటుడు నాగచైతన్య (Naga Chaitanya)పై అనేక రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala)తో నాగచైతన్య డేటింగ్లో ఉన్నారంటూ గత కొన్నిరోజులుగా టాలీవుడ్ (Tollywood), పలు వెబ్సైట్లలో సైతం వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఆ వార్తలపై ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ లేదు.
ఈ నేపథ్యంలో తాజాగా వీరి మధ్య రిలేషన్‌షిప్‌పై ప్రముఖ వార్తా సంస్థ ‘ఇండియా టుడే’ (India Today) ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. నాగ చైతన్య – శోభిత ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలిపింది. రిలేషన్ షిప్‌పై ప్రకటన గురించి ఇద్దరూ ఇప్పటికే ఒక తుది నిర్ణయానికి వచ్చారని ఇండియా టుడే పేర్కొంది. ఈ మేరకు వీరిద్దరికీ అత్యంత సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిపింది. ఇదిలా ఉంటే.. ఓ వ్యాపారవేత్త కుమార్తెను నాగచైతన్య రెండో వివాహం చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలను కూడా సదరు వర్గాలు ఖండించినట్లు తెలిపింది.
‘నాగచైతన్య ఓ వ్యాపారవేత్త కుమార్తెను రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఎందుకంటే అతడు (నాగచైతన్య) ఇప్పటికీ శోభితతో డేటింగ్లో ఉన్నాడు. వారి బంధం చాలా బలంగా ఉంది. ఈ జంట తమ రిలేషన్‌షిప్‌ను త్వరలోనే బహిర్గతం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించే విషయమై ఇరువురూ చర్చించారు’ అని ఇండియా టుడే తన కథనంలో వెల్లడించింది.
టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత, అక్కినేని నాగచైతన్య తమ వైవాహిక బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసుకున్న సమంత.. తన ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి సారించింది. గత కొన్ని రోజులుగా మయోసైటిస్‌తో బాధపడుతున్న సామ్.. దానికోసం అమెరికాలో చికిత్స తీసుకుంటోంది. మరోవైపు, నాగచైతన్య కూడా తన తదుపరి చిత్రాలపై పూర్తి ఫోకస్ పెట్టాడు.
Also Read..
Jawan Movie | షారుఖ్ సర్‌తో మాట్లాడి.. జవాన్ చిత్రాన్ని ఆస్కార్‌కి తీసుకెళ్తా : దర్శకుడు అట్లీ
Rajamouli | రాజమౌళి సమర్పణలో ఇండియా బయోపిక్.. వీడియో రిలీజ్ చేసిన జక్కన్న
Vijay Antony | బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని కుమార్తె ఆత్మహత్య
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

