Parliament : పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాలు (Winter session) రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్లో మరికాసేపట్లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు పార్లమెంట్‌కు చేరుకున్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చకు రానున్న బిల్లులు, వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను కోరనుంది. కాగా పార్లమెంట్ వింటర్ సెషన్లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల సమస్యలు తదితర అంశాలపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది.
#WATCH | Leaders including BJD MP Sasmit Patra, MDMK MP Vaiko, Congress MPs Pramod Tiwari, Jairam Ramesh and others arrive for the all-party meeting at the Parliament.
The Winter Session of Parliament will begin tomorrow, 25th November and continue till 20th December. pic.twitter.com/oQORe3h73r
— ANI (@ANI) November 24, 2024