న్యూఢిల్లీ: ఈ నెలలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న క్రమంలో శాసన సంబంధ, ఇతర అజెండాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలతో ఈ నెల 27న సమావేశం కానుంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంతో 28న ప్రారంభమయ్యే సమావేశంలో ఫిబ్రవరి 1న ఆదివారం చాలా అరుదుగా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 2 వరకు కొనసాగుతాయి.