చండీగఢ్, డిసెంబర్ 15: తాము చేస్తున్న పోరాటంతో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) చేతులు కలపాలని పంజాబ్ రైతు నేత సర్వన్ సింగ్ పంఢేర్ ఆదివారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆ సంఘానికి లేఖ రాసినట్టు ఆయన తెలిపారు. రైతుల డిమాండ్లను కేంద్రం ఆమోదించేలా ఒత్తిడి చేసేందుకు కర్షకులంతా కలిసికట్టుగా పోరాడాలని ఎస్కేఎం నేత రాకేశ్ టికాయత్ పిలుపునిచ్చిన కొద్ది రోజులకు పంఢేర్ ఈ విధంగా స్పందించారు.
ఎస్కేఎం(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా సంఘాలు ప్రస్తుతం శంభు, ఖనౌరి సరిహద్దుల్లో నిర్వహిస్తున్న ఢిల్లీ చలో పాదయాత్రను భదత్రా దళాలు అడ్డుకున్నాయి. ‘రైతులు, కూలీల సంక్షేమం దృష్ట్యా సంఘాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను మరచిపోయి ఢిల్లీ ఆందోళన-2లో పాల్గొనాలని నేను నా సోదరులకు(ఎస్కేఎం)కు విజ్ఞప్తి చేస్తున్నా’ అని పంఢేర్ మీడియాతో తెలిపారు.