Kallakurichi illicit liquor case : కళ్లకురిచి నాటు సారా ఘటనలో పెద్దసంఖ్యలో ప్రజలు మరణించిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి డిమాండ్ చేశారు. కళ్లకురిచి ఘటనపై రాష్ట్ర పోలీసులు విచారణ చేపట్టారని, అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపడితే నిజమైన దోషులకు శిక్ష పడదని అన్నారు.
రాష్ట్ర పోలీసుల విచారణపై సీబీఐ దర్యాప్తు జరిగితే వాస్తవాలు వెలుగుచూస్తాయని చెప్పారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించి నిజమైన దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు కల్తీ సారా ఘటనపై తమిళనాడు బీజేపీ నేత తమిళి సై స్పందించారు. కల్తీ సారా ఘటనతో ప్రజలు మృత్యువాత పడిన కళ్లకురుచిని స్టాలిన్ ఎందుకు సందర్శించలేదని తమిళిసై ప్రశ్నించారు.
మరోవైపు బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కే ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యను ఆమె ఖండించారు. ద్రవిడ మోడల్ ప్రస్తుతం హత్యా రాజకీయాల మోడల్‌గా మారిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడులో హత్యా రాజకీయాలు పెరుగుతున్నాయని, ఇంత జరుగుతున్నా సీఎం స్టాలిన్ మౌన ముద్ర దాల్చారని ఆరోపించారు. ఈ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.
Read More :