Rishabh Shetty | కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చి తెలుగుతోపాటు గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన యాక్టర్ ఒకరు.. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా ఫాంటసీ స్టోరీతో బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన యాక్టర్ మరొకరు. ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది. చూసేందుకు మూవీ లవర్స్‌కు మాత్రం పండగే అని చెప్పాలి. ఇంతకీ ఆ ఇద్దరెవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. కాంతార ఫేం రిషబ్ శెట్టి (Rishabh Shetty), హనుమాన్ హీరో తేజ సజ్జా (Teja Sajja).
ఈ ఇద్దరు ఓ ఈవెంట్లో కలుసుకున్నారు. రిషబ్ శెట్టి బర్త్ డే సందర్భంగా అతడితో దిగిన ఫొటోను తేజ సజ్జా ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి మంటలు రేపడం చూసేందుకు ఎదురుచూస్తున్నా. అంటూ క్యాప్షన్ ఇచ్చాడు తేజ. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్పై బిజీగా ఉండగా.. తేజ సజా మిరాయి సినిమా చేస్తున్నాడు.
Devara | డబ్బింగ్ పనుల్లో తారక్ దేవర.. హిమజ క్లారిటీ
Saripodhaa Sanivaaram | నాని ‘సరిపోదా శనివారం’ నుంచి ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ రిలీజ్
Raj Tharun – Lavanya | రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేను : లావణ్య