Pakistan violates ceasefire | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam attack) తర్వాత భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి దాయాది దేశం పాకిస్థాన్ నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. వరుసగా 11వ రోజు అంటే ఆదివారం అర్ధరాత్రి సోమవారం ఉదయం మధ్యలో సరిహద్దుల్లో కాల్పులకు తెగబడింది. కుప్వారా, బరాముల్లా, పూంచ్, రజౌరీ, మెందర్, నౌషేరా, సుందరబనీ, అంకూర్ల సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు జరిపింది. ఈ మేరకు భారత ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పి కొట్టినట్లు పేర్కొంది.
పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్ కయ్యానికి కాలుదువ్వుతోంది. వరుసగా క్షిపణి ప్రయోగాలను పరీక్షిస్తోంది. పాకిస్థాన్ శనివారం అబ్దాలి వెపన్ సిస్టమ్ క్షిపణి శిక్షణ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించినట్టు తెలిపింది. ఎక్స్ ఇండస్ కసరత్తుల్లో భాగంగా తయారు చేసిన 450 కి.మీ పరిధి గల ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి ఇది. ఇక ఇవాళ ఫతహ్ మిస్సైల్‌ను పరీక్షించింది. 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను ఈ మిస్సైల్ పేల్చగలదు. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్. పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ఈ క్షిపణి పరీక్ష గురించి అప్డేట్ ఇచ్చింది.
Also Read..
Military Training | పాక్‌లో మిలిటరీ శిక్షణ పొందిన పెహల్గామ్ ఉగ్రవాదులు..!
PM Modi | పాక్‌తో ఉద్రిక్తతల వేళ.. ప్రధాని మోదీతో రక్షణశాఖ కార్యదర్శి భేటీ
Chenab River | పాక్‌కు చీనాబ్ నీళ్లు బంద్.. సలాల్ జలాశయం గేట్లు మూసివేత.. VIDEOS