శ్రీనగర్ : జమ్మూలోని ఆర్నియా సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు (IB) వెంట మంగళవారం పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. వెంటనే భారత బలగాలు సైతం ధీటైన బదులిచ్చాయి. గతేడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ కాల్పులు జరుగడం ఇదే తొలిసారి. 2002లో ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం అర్నియా సెక్టార్లో పాక్ రేంజర్లు అకారణంగా కాల్పులు జరిపారని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ప్రతినిధి తెలిపారు. అప్రమత్తమైన బీఎస్ఎఫ్ దళాలు గట్టి సమాధానం ఇచ్చాయని పేర్కొన్నారు. అయితే, కాల్పుల్లో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.