Golden Temple | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్‌తో భారత్ బదులు తీర్చుకున్న విషయం తెలిసిందే. మే 7వ తేదీన పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని దాదాపు తొమ్మిది ఉగ్రస్థావరాలపై మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఆ ఉగ్రస్థావరాలు నేలమట్టమయ్యాయి. అంతేకాదు వందమందికిపైగా ఉగ్రవాదులు సైతం హతమయ్యారు.
ఈ దాడుల తర్వాత పాక్ కూడా ప్రతిదాడులకు (Pakistan targeted) యత్నించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్ (Punjab)లోని అమృత్సర్ (Amritsar)లో గల స్వర్ణ దేవాలయాన్ని (Golden Temple) మిస్సైళ్లు, డ్రోన్లతో లక్ష్యంగా చేసుకున్నట్లు 15వ ఇన్ఫాంట్రీ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC) మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి సోమవారం వెల్లడించారు. అయితే, ఆ దాడులను ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సమర్థవంతంగా తిప్పి కొట్టినట్లు తెలిపారు. ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన దాడులతో ఉక్కిరిబిక్కిరైన పాకిస్థాన్ మన దేశంలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు. సైనిక స్థావరాలు, నివాస ప్రాంతాలు, ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకుంటుందని భారత సైన్యం ముందుగానే ఊహించిందని తెలిపారు. ఇందులో స్వర్ణ దేవాలయం అత్యంత ప్రముఖమైనదిగా భావించి అక్కడ పూర్తిస్థాయి వైమానిక రక్షణ కల్పించినట్లు వివరించారు.
Also Read..
Spying For Pak | పాకిస్థాన్ కోసం గూఢచర్యం.. యూపీ వ్యాపారి అరెస్ట్
Travis Head | కరోనా బారినపడ్డ ట్రావిస్ హెడ్.. నేటి లక్నో మ్యాచ్‌కు దూరమయ్యే ఛాన్స్..!