Travis Head | కరోనా బారినపడ్డ ట్రావిస్ హెడ్.. నేటి లక్నో మ్యాచ్‌కు దూరమయ్యే ఛాన్స్..!
Travis Head | సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కరోనా వైరస్ బారినపడ్డాడు. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌కు దూరం కానున్నాడు. సన్‌రైజర్స్ హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి ఈ విషయాన్ని వెల్లడించారు.
Travis Head | సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కరోనా వైరస్ బారినపడ్డాడు. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌కు దూరం కానున్నాడు. సన్‌రైజర్స్ హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి ఈ విషయాన్ని వెల్లడించాడు. హెడ్ కొవిడ్ బారినపడడంతో భారత్‌కు రావడంలో ఆలస్యమవుతుందని కోచ్ పేర్కొన్నాడు. అయితే, హెడ్‌కు ఎప్పుడు.. ఎక్కడ కరోనా వైరస్ వచ్చిందనే విషయాన్ని మాత్రం సన్‌రైజర్స్ కోచ్ సమాధానం ఇవ్వలేదు. సోమవారం ఉదయం వరకు భారత్‌కు చేరుకుంటాడని.. వైద్య సిబ్బంది అతన్ని పరీక్షిస్తారని ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేస్తామని పేర్కొన్నాడు.
వెట్టోరి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హెడ్ సోమవారం ఉదయం వస్తున్నాడని చెప్పాడు. కొవిడ్ బారినపడడంతో ప్రయాణించలేకపోయాడని తెలిపాడు. ఇదిలా ఉండగా.. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ వారం పాటు వాయిదా పడింది. హెడ్ కెప్టెన్ కమిన్స్‌తో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. జూన్ 11న ప్రారంభం కానున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు ఇద్దరు మళ్లీ ఐపీఎల్లో చేరుతారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అయితే, మిగతా మ్యాచుల కోసం హెడ్, కమిన్స్ ఇద్దరూ భారత్‌కు వస్తారని సన్‌రైజర్స్ జట్టు యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. మే 25న చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనున్నది. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టుకు మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సోమవారం లక్నోతో, ఆ తర్వాత ఆర్సీబీ, కేకేఆర్‌తో మ్యాచులు ఆడనున్నది. ఇదిలా ఉండగా.. ట్రావిస్ హెడ్ ఈ ఐపీఎల్ సీజన్లో 11 మ్యాచుల్లో 281 పరుగులు చేశాడు. గత సీజన్లో 15 మ్యాచుల్లో 567 పరుగులు చేయగా.. ఈ సారి మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

