POK | న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జీలంనదిలోకి భారత్ అకస్మాత్తుగా నీటిని విడుదల చేసిందని పాక్ ఆరోపించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీవోకే) ముజఫరాబాద్ వద్ద జీలంనదిలో నీటి మట్టాలు అకస్మాత్తుగా పెరిగాయని ‘దునియా’ న్యూస్ నివేదిక పేర్కొంది. దీనికి భారతదేశమే కారణమని ఆరోపించింది. ముజఫరాబాద్‌కు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో జీలం నది ఒడ్డున ఉన్న హట్టియన్ బలా అనే ప్రాంతంలో స్థానిక అధికారులు నీటి అత్యవసర స్థితిని ప్రకటించారు. మసీదుల్లో ప్రకటనల ద్వారా స్థానికులను హెచ్చరించారు.