Chenab Bridge | న్యూఢిల్లీ: చైనా ఆదేశం మేరకు ఆ దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో కలిసి పాకిస్థాన్ నిఘా సంస్థ జమ్ము కశ్మీర్లోని చీనాబ్ వంతెనకు సంబంధించిన ముఖ్య సమాచారం సేకరిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు ఇండియా టుడేకు తెలిపాయి.
ఈ వంతెన ద్వారా కల్లోలిత సరిహద్దు ప్రాంతంలో భారత్కు వ్యూహాత్మక అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రైల్వే వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినది.