Pahalgam attack : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) లో మరణించిన వారి కుటుంబాలకు అసోం (Assam) ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ మేరకు అసోం కేబినెట్ (Assam cabinet) మంగళవారం తీర్మానం చేసింది. ఈ విషయాన్ని అసోం ముఖ్యమంత్రి (Assam CM) హిమాంత బిశ్వశర్మ (Himantha Biswa Sharma) మీడియాకు వెల్లడించారు.
ఏప్రిల్ 22న జమ్ముకశ్మర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడి జరిగింది. పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. మహిళలను, చిన్నారులను వదిలేసి పురుషులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మొత్తం 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 25 మంది భారతీయులు ఉన్నారు. మరొకరు నేపాల్‌కు చెందిన వ్యక్తి. ఈ ఘటన నేపథ్యంలో ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి.