న్యూఢిల్లీ: కరోనా రోగుల తాకిడితో దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. దాంతో దేశంలోని వివిధ స్టీల్ ప్లాంట్ల నుంచి అవసరమైన ఆస్పత్రులకు ఆక్సిజన్ ట్యాంకర్లను పంపుతున్నారు. పెద్దమొత్తంలో ఆక్సిజన్ అవసరమైన ప్రాంతాలకు ఏకంగా రైళ్లలో ట్యాంకర్లను ఎక్కించి చేరవేస్తున్నారు. ఈ రైళ్లను ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లుగా పేర్కొంటున్నారు.
తాజాగా ఈ తెల్లవారుజామున ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్గఢ్లోగల జిందాల్ స్టీల్ ప్లాంట్ నుంచి దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌కు ఒక ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ చేరుకున్నది. ఈ రైల్లో పలు ఆక్సిజన్ ట్యాంకర్లను తీసుకొచ్చారు. ఈ ట్యాంకర్ల ద్వారా రాజధానిలో పలు ఆస్పత్రులకు ఆక్సిజన్‌ను సరఫరా చేయనున్నారు.
#WATCH | 'Oxygen Express' from Jindal Steel Plant in Raigarh of Chhattisgarh reached Delhi today. Oxygen tankers were sent to different hospitals of the national capital. #COVID19 pic.twitter.com/SIcWzj7wKQ
— ANI (@ANI) April 27, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఆస్పత్రిలో గొడవ.. డాక్టర్‌ను చెంపదెబ్బ కొట్టిన నర్సు, నర్సుపై డాక్టర్ దాడి.. వీడియో
యూకే నుంచి భారత్‌కు ప్రాణాధార వైద్య సామాగ్రి: కేంద్రం
క్యాన్సర్ రోగులు టీకా వేసుకోవచ్చు
25 మిలియన్ల ప్రేమను పొందిన లాహే లాహే సాంగ్
కరోనా వేళ భారత్‌కు బాసటగా నిలిచిన ఫ్రాన్స్, కువైట్
పదిమందిలో కలవొద్దు.. బాతఖానీ పెట్టొద్దు..