Pet Pitbull | విశ్వాసం అంటే ఇది.. గడ్డకట్టే చలిలోనూ యజమాని డెడ్‌బాడీకి రక్షణగా నిలిచిన శునకం
Pet Pitbull | యజమాని పట్ల ఓ శునకం (Pet Pitbull) తన విశ్వాసాన్ని చాటుకుంది.
Pet Pitbull | యజమాని పట్ల ఓ శునకం (Pet Pitbull) తన విశ్వాసాన్ని చాటుకుంది. మరణించిన యజమాని మృతదేహానికి గడ్డ కట్టే చలిలో దాదాపు 4 రోజులపాటూ కాపలా కాసింది. ఈ హృదయ విదారక ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో ప్రస్తుతం భారీగా హిమపాతం పడుతోంది. రోడ్లపై మంచు పేరుకుపోయింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. భారీ హిమపాతం, ఎముకలు కొరికే చలితో అక్కడ ప్రస్తుతం కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. చలి తీవ్రతకు తట్టుకోలేక ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అయితే, మృతదేహానికి ఓ పెంపుడు శునకం దాదాపు నాలుగు రోజులపాటూ గడ్డకట్టే చలిలోనూ కాపలా కాసింది.
చంబా (Chamba) జిల్లాలోని భర్మౌర్ (Bharmaur) ప్రాంతంలో పియూష్ అనే వ్యక్తి కనిపించకుండా పోయాడు. అతడు కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య మంచులో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు, స్థానికులు అంచనా వేశారు. ఈ క్రమంలో సమీప ప్రాంతంలో వారి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో వారికి కనిపించిన ఓ దృశ్యం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. అడవి జంతువుల నుంచి రక్షించుకునేందుకు పియూష్ డెడ్‌బాడీ వద్ద ఆ శునకం కాపలాగా ఉంది. గడ్డకట్టే చలిలో నాలుగురోజులపాటూ తిండి, నీళ్లు లేకుండా కాపలా కాసింది. రెస్క్యూ సిబ్బందిని కూడా యజమాని డెడ్‌బాడీ వద్దకు రానివ్వలేదు. ఈ దృష్యం చూసి అక్కడివారంతా చలించిపోయారు. ఇందుకు సంబంధించిన దృష్యాలు వైరల్ అవుతున్నాయి.
Also Read..
Snowfall | హిమాచల్‌లో తీవ్రమైన మంచు.. వెయ్యికిపైగా రోడ్లు మూసివేత.. చిక్కుకుపోయిన పర్యాటకులు
Sunita Williams | ఫలూదా ఎంజాయ్ చేస్తున్న సునీతా విలియమ్స్.. వీడియో
Indian Railways | ట్రైన్ ఆలస్యంతో పరీక్ష రాయలేకపోయిన విద్యార్థిని.. రూ.9 లక్షల పరిహారం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

