ముంబై: మహారాష్ట్రలో అధికారంలో ఉన్న సీఎం ఏక్నాథ్ షిండే శివసేన, బీజేపీ జారీ చేసిన ‘ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్’ పై (Star Campaigner List) శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ రెండు పార్టీలు ప్రజాప్రాతినిధ్య చట్టం, మోడల్ ప్రవర్తనా నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించాయని ఆరోపించింది. షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీ కలిసి తమ ‘స్టార్ క్యాంపెయినర్ లిస్ట్’లో ఇతర రాజకీయ పార్టీలకు చెందిన అనేక మంది వ్యక్తుల పేర్లను ప్రచురించాయని ఆ ఫిర్యాదులో పేర్కొంది. షిండే శివసేన, బీజేపీ ప్రచారకర్తల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌తో సహా ఉన్నతస్థాయి ప్రభుత్వ పదవుల్లో ఉన్న వివిధ వ్యక్తుల పేర్లను పేర్కొన్నారని తెలిపింది.
కాగా, స్టార్ ప్రచారకర్తల జాబితాలు విడుదల చేసిన షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీ ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించాయని ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) ఆరోపించింది. అంతేగాక కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రతినిధులు ఎన్నికల ప్రచార ప్రయోజనాల కోసం తమ అధికారిక పదవులను వినియోగించుకోకుండా నిషేధించే మోడల్ ప్రవర్తనా నియమావళిని కూడా ఉల్లంఘించారని ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
We have filed a complaint to the Election Commission of India regarding the gross violations by Shiv Sena (Eknath Shinde) and the Bharatiya Janata Party of the Representation of People’s Act and the Model Code of Conduct.
Both Shiv Sena (Eknath Shinde) and Bharatiya Janata… pic.twitter.com/pYYgBK3EVH
— Nationalist Congress Party – Sharadchandra Pawar (@NCPspeaks) March 30, 2024