Kedarnath | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌ను పోలిన మరో ఆలయాన్ని ఢిల్లీలో నిర్మించాలనుకొన్న ఉత్తరాఖండ్ బీజేపీ సర్కారు నిర్ణయాన్ని దేశంలోని పీఠాధిపతులు, ప్రధాన ఆలయ పూజారులు, ఆధ్యాత్మికవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
హిమాలయాల్లోని కేదార్నాథ్ ఆలయమే నిజమైనదని, ఇప్పుడు మరో ఆలయాన్ని ఢిల్లీలో నిర్మించడమేంటని జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద ప్రశ్నించారు. కేదార్నాథ్ పేరిట మరో ఆలయాన్ని నిర్మించడం సరైనది అయోధ్య రామాలయం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ అభిప్రాయపడ్డారు. కేదార్నాథుడు ఒక్కడేనని, ఢిల్లీలో నిర్మించే ఆలయం.. 12 జ్యోతిర్లింగాల్లో ఎన్నటికీ కలువబోదని తేల్చిచెప్పారు. ఆలయ నిర్మాణంపై పునరాలోచన చేయాలని, లేదా గుడి పేరు మార్చాలని ప్రభుత్వానికి సూచించారు.