న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సుమారు రూ.2 వేల కోట్ల విలువైన 500 కిలోల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు. దీని వెనుక అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సిండికేట్ ఉందని తెలిపారు.
ఢిల్లీలో ఈ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారి. కాగా, ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఆదివారం ఇద్దరు ఆఫ్గాన్ జాతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 400 గ్రాముల హెరాయిన్, 160 గ్రాముల కొకెయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదే రోజు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి 1,660 గ్రాముల కొకెయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.24 కోట్లు.