Ganesh Visarjan | దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. దాదాపు 11 రోజుల పాటూ పూజలందుకున్న గణనాథులకు ‘మళ్లీ రావయ్యా.. గణపయ్యా..’ అంటూ భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు సహా ప్రధాన నగరాల్లో అనంత చతుర్ధశి సందర్భంగా శనివారం గణేశ్ నిమజ్జన (Ganesh Visarjan) కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు.
ముంబై (Mumbai)లోని ఐకానిక్ లాల్బాగ్చా రాజా (Lalbaugcha Raja) గణనాథుడి నిమజ్జనం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. స్వామివారి ఊరేగింపుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ముంబై వీధులు జనసంద్రంగా మారాయి. ఇదే అదునుగా దొంగలు చేతివాటం ప్రదర్శించారు. దాదాపు 100కి పైగా మొబైల్ ఫోన్లు, బంగారు ఆభరణాలను దొంగలు దోచుకున్నట్లు (Mobile Phones Stolen) పోలీసులు తాజాగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మొబైల్ ఫోన్ల దొంగతనాలు, చైన్ స్నాచింగ్లకు సంబంధించి 100కి పైగా ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ నాలుగు మొబైల్ ఫోన్స్, రెండు బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. చైన్ స్నాచింగ్ కేసులకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
VIDEO | Mumbai: Immersion procession of Lalbaugcha Raja begins as thousands gather to bid an emotional farewell.
Devotees line the streets with chants, dance, and devotion as the majestic Lalbaugcha Raja embarks on his final journey, Ganesh Visarjan.#LalbaugchaRaja… pic.twitter.com/93XevLwZ6m
— Press Trust of India (@PTI_News) September 6, 2025
Also Read..
Restaurant Staff | హోటల్ సిబ్బంది, కస్టమర్ల మధ్య ఘర్షణ.. షాకింగ్ వీడియో
AC unit catches fire | ఏసీ యూనిట్లో మంటలు.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
Rekha Gupta | ప్రభుత్వ సమీక్షలకు సీఎం రేఖా గుప్తా భర్త.. ఢిల్లీ ప్రభుత్వంపై ఆప్ విమర్శలు