AC unit catches fire | హర్యానా (Haryana)లో విషాదం చోటు చేసుకుంది. ఏసీ యూనిట్లో మంటలు వ్యాపించాయి (AC unit catches fire). దీంతో ఊపిరాడక ఒకే కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటన ఫరీదాబాద్ (Faridabad)లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సచిన్ కపూర్, రింకూ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఫరీదాబాద్‌లోని గ్రీన్‌ఫీల్డ్ కాలనీ (Greenfields Colon)లో నివాసం ఉంటున్నారు. వారు నివసిస్తున్న అపార్ట్మెంట్ మొదటి అంతస్తులోని ఏసీ యూనిట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సచిన్ ఫ్యామిలీ.. తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అయితే దట్టమైన పొగ కారణంగా రెండో అంతస్తులో చిక్కుకుపోయింది. ఈ క్రమంలో ఊపిరాడక సచిన్, ఆయన భార్య రింకూ, కుమార్తె సుజన అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుమారుడు ఆర్యన్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో వారి పెంపుడు కుక్క కూడా మరణించింది.
Also Read..
Rekha Gupta | ప్రభుత్వ సమీక్షలకు సీఎం రేఖా గుప్తా భర్త.. ఢిల్లీ ప్రభుత్వంపై ఆప్ విమర్శలు
Gold Kalash | ఎర్రకోటలో భారీ చోరీ.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Encounter | జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం