Gold Kalash | దేశ రాజధానిలోని ఎర్ర కోట (Red Fort) ప్రాంగణంలో భారీ చోరీ వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఓ మతపరమైన (Jain religious event) కార్యక్రమంలో రూ.1.5 కోట్ల విలువైన బంగారు కలశాలు (Gold Kalash) చోరీకి గురయ్యాయి. జైన పూజారి వేషంలో వచ్చిన దొంగ బంగారు వస్తువులతో ఉడాయించినట్లు సీసీటీవీ ఫుటేజీ బయటపెట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తాజాగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు భూషణ్ వర్మ (Bhushan Verma)గా గుర్తించారు. అతడిని ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని హాపూర్ (Hapur)లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. పూజారి వేషంలో ఉన్న అతడు జైన మతానికి చెందిన వాడు కాదని పోలీసు వర్గాలు తెలిపాయి. అతడు అనేక కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని విచారిస్తున్నారు.
ఆగస్టు15న పార్కు వద్ద దస్లక్షన్ మహోత్సవ పేరిట జైన మతస్థులకు చెందిన 10 రోజుల ఉత్సవాలు జరుగుతున్నాయి. గత బుధవారం పూజా క్రతువు కోసం ఏర్పాట్లు జరుగుతుండగా ఈ చోరీ జరిగింది. ఓ బంగారు కలశం, 760 గ్రాముల బరువున్న బంగారు కొబ్బరికాయ, మరో 115 గ్రాముల బరువుతో వజ్రాలు, ఎమెరాల్డ్స్, రూబీలు పొదిగిన చిన్న బంగారు కలశంతో సహా విలువైన పూజా పాత్రలు మాయమయ్యాయి. జైన పూజారి వేషంలో వచ్చిన దొంగ బంగారు వస్తువులతో ఉడాయించినట్లు సీసీటీవీ ఫుటేజీ బయటపెట్టింది. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
Also Read..
Domestic Violence | బీజేపీ ఎంపీ సోదరికి అత్తింట్లో వేధింపులు.. అందరిముందే కొట్టిన మామ
Encounter | జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం