Restaurant Staff | రాజస్థాన్ జైపూర్ (Jaipur)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రముఖ రెస్టారెంట్లో సీటు బుకింగ్ విషయంలో సిబ్బంది (Restaurant Staff), కస్టమర్ల (Customers) మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదికాస్తా ఘర్షణకు (Fight) దారి తీయడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి ఏర్పడింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. నహర్‌గఢ్ హిల్స్‌లో (Nahargarh Hills) ఉన్న పడావో రెస్టారెంట్ (Padao restaurant)లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రెస్టారెంట్ రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ యాజమాన్యంలో నడుస్తోంది. రెండు జంటలు డిన్నర్ కోసం ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో రెస్టారెంట్‌కు వెళ్లారు. వారు ముందుగానే రిజర్వ్ చేసుకున్న సీటు విషయంలో హోటల్ సిబ్బందితో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం కాస్తా కాసేపటికి ఘర్షణకు దారి తీసింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకూ వెళ్లారు. ఇద్దరు మహిళలు సహా దాదాపు 15 మంది వ్యక్తులు ఘర్షణకు దిగారు. రెస్టారెంట్ సిబ్బంది తమను వేధించారంటూ ఇద్దరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెస్టారెంట్ సిబ్బంది సైతం కస్టమర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Warning : *Fight Scene*
• जयपुर के नाहरगढ स्थित पड़ाव रेस्टोरेंट में कल रात भारी बवाल
• रेस्टोरेंट कर्मचारियों पर वहां आई युवतियों से छेड़छाड़ का लगा आरोप, इसके बाद की गई मारपीट#Jaipur pic.twitter.com/uWziNN7dYu
— Avdhesh Pareek (@Zinda_Avdhesh) September 8, 2025
Also Read..
AC unit catches fire | ఏసీ యూనిట్లో మంటలు.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
Rekha Gupta | ప్రభుత్వ సమీక్షలకు సీఎం రేఖా గుప్తా భర్త.. ఢిల్లీ ప్రభుత్వంపై ఆప్ విమర్శలు
Gold Kalash | ఎర్రకోటలో భారీ చోరీ.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు