Lok Sabha: ఆరోజు పార్లమెంటులో ప్రధాని మోదీ సీటు వద్ద జరిగింది ఇది.. వీడియో రిలీజ్ చేసిన ప్రభుత్వం
Lok Sabha: లోక్సభలో ప్రధాని మోదీ కూర్చునే సీటు వద్ద ఫిబ్రవరి 4వ తేదీన విపక్ష మహిళా ఎంపీలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు చెందిన వీడియోను ఇవాళ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. మంత్రి రిజిజు ఆ వీడియోను పోస్టు చేశారు.
న్యూఢిల్లీ: లోక్సభ(Lok Sabha)లో ఫిబ్రవరి 4వ తేదీన ప్రధాని మోదీ కూర్చునే సీటు వద్ద విపక్ష మహిళా ఎంపీలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు చెందిన వీడియోను ఇవాళ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. విపక్ష మహిళా సభ్యులు బ్యానర్లు పట్టుకుని.. మోదీ కూర్చుకునే సీటు వద్ద నినాదాలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడేందుకు ఆ సమయంలో ప్రధాని మోదీ అక్కడకు రావాల్సి ఉన్నది. కానీ విపక్ష మహిళా ఎంపీల నిరసన వల్ల.. ఆయన రాలేకపోయారు. ఆ తర్వాత ప్రధాని ప్రసంగం చేయకుండానే తీర్మానాన్ని ఆమోదించినట్లు లోక్సభ ప్రకటించింది.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇవాళ ఆ రోజున జరిగిన ఘటనకు చెందిన వీడియోను తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి నేతృత్వంలో కొందరు మహిళా ఎంపీలు మోదీ సీటు వద్ద ఆందోళన చేపట్టారు. ప్రధాని మోదీ వెళ్లే మార్గంలో నిలుచుని నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీల దిగజారుడు ప్రవర్తన పట్ల గర్వంగా ఫీలవుతుందని మంత్రి రిజిజు తన ట్వీట్లో ఆరోపించారు. తమ పార్టీ హుందాగా వ్యవహరించి, పార్లమెంట్ గౌరవాన్ని, పవిత్రతను కాపాడినట్లు మంత్రి చెప్పారు. ప్రధానిని అడ్డుకున్న మహిళా విపక్ష ఎంపీలపై చర్యలు తీసుకోవాలని ఇవాళ బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్ను కోరుతూ లేఖ రాశారు.
Congress Party is proud of the most degrading behavior by their MPs !! If we had not stopped all BJP MPs and allowed the Women MPs to confront Cong. MPs, it would have led to very ugly scene.
We have very high consideration, to protect the dignity & sanctity of the Parliament. https://t.co/tRj5HjLKFH pic.twitter.com/aTmktk4Y7E— Kiren Rijiju (@KirenRijiju) February 10, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

