ఏజెన్సీ ప్రాంతాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
ఏజెన్సీ ప్రాంతాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు నాయకత్వం వహించాలని మంత్రి సీతక పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని, అందుబాటులో ఉన్న పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు.
- మహిళా సర్పంచుల శిక్షణ శిబిరంలో మంత్రి సీతక్క
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : ఏజెన్సీ ప్రాంతాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు నాయకత్వం వహించాలని మంత్రి సీతక పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని, అందుబాటులో ఉన్న పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్చార్డీలో కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో ఏజెన్సీ ప్రాంతాల మహిళా సర్పంచులకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి సీతక మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒకరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని సూచించారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని ప్రతి సర్పంచ్ తన గ్రామానికి ఏం చేయాలనే దానిపై ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంసీఆర్హెచ్చార్డీ డీజీ శాంతికుమారి, పంచాయతీరాజ్శాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్, శిక్షణ కోఆర్డినేటర్ సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

